KDP: చెన్నూరు పంచాయతీకి రాష్ట్రస్థాయి స్వచ్ఛ్ ఆంధ్ర అవార్డు లభించింది. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కడప జిల్లా పంచాయతీ అధికారిణి రాజ్యలక్ష్మి, డిప్యూటీ ఎంపీడీవో సురేష్ బాబు, పంచాయతీ సెక్రటరీ రామసుబ్బారెడ్డి అవార్డును స్వీకరించారు. ఈ అవార్డుతో జిల్లాకు విశేషమైన గుర్తింపు వచ్చిందని అధికారులు తెలిపారు.