NRML: ముధోల్ మండలం విట్టోలి గ్రామ సమీపంలో గల రాళ్ల చెరువుకు గండి పడింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎక్కువ ప్రాంతంలో వరద నీరు వచ్చి రాళ్లచెరువులో చేరింది. దీంతో రాళ్లచెరువుకు గండిపడి పంట పొలాల్లోకి నీళ్లు చేరి సోయా పత్తి వరి పంటలు నీట మునిగాయి. చెరువులోని నీరు వృధాగా పోతున్నాయి. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో చెరువులు నిండుకుండలా మారాయి.