KDP: దువ్వూరు(M) సమీపంలో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌పై మంగళవారం మధ్యాహ్నం దాడి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఆళ్లగడ్డ నుంచి మైదుకూరుకు ఓ బస్సు బయల్దేరింది. దీంతో దువ్వూరు దగ్గర బస్ ఆపలేదని ఓ వ్యక్తి, డ్రైవర్‌పై దాడి చేశాడు. తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. కాగా, బస్సులో 120 మంది ప్రయాణికులు ఉండటంతో ఆపలేదని డ్రైవర్ చెబుతున్నాడు.