TG: తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు తీన్మార్ మల్లన్న హైకోర్టును ఆశ్రయించారు. తన రాజకీయ పార్టీ గుర్తింపు, గుర్తుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు కల్పించాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది.