KDP: కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. వాల్మీకి చిత్రపటానికి ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. రామాయణం ద్వారా ప్రతి ఒక్కరూ మానవతా విలువలు, ఉన్నతమైన ఆదర్శాలు ఆచరించాలన్నారు. ప్రతి ఒక్కరూ మానవత విలువలతో పనిచేయాలని సూచించారు.