AP: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని నారావారిపల్లెకు సీఎం చంద్రబాబు చేరుకున్నారు. తన దివంగత సోదరుడు నారా రామ్మూర్తినాయుడి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రామ్మూర్తినాయుడు ఘాట్ వద్ద నివాళులర్పించి స్మృతివనం ప్రారంభించారు. చంద్రబాబుతోపాటు ఆయన కుటుంబ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. గతేడాది రామ్మూర్తినాయుడు అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే.