NLG: నల్గొండ పట్టణంలో అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్ సయ్యద్ హెచ్చరించారు. పట్టణంలోని ప్రకాశంబజారులో మురుగు కాల్వపై అనుమతి లేకుండా నిర్మించిన గోడపై ఫిర్యాదులు రావడంతో పట్టణ ప్రణాళిక ఆధికారులతో కలిసి పరిశీలించారు. గోడను తొలగించాలని ఆదేశించడంతో సిబ్బంది తొలగించారు.