KMR: మహమ్మద్ నగర్ మండలంలోని గాలిపూర్, మక్దంపూర్ గ్రామాలలో నేడు నాయకపోడు కుల సంఘం ఆధ్వర్యంలో 85వ కొమురం భీం వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కొమరంభీమ్ చిత్రపటానికి పూలమాలవేసి ఆయన సేవలను స్మరించుకుని ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ.. జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు.