బాపట్ల: జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో మంగళవారం మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్ వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. వాల్మీకి అందించిన రామాయణ సందేశం ఆదర్శనీయమని ప్రసంగించారు. పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.