ADB: నేరడిగొండ మండలంలోని వాగ్దారి గ్రామానికి చెందిన పాత్రికేయుడు జాదవ్ రామారావు తమ్ముడు జాదవ్ పరశురాం ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన పెద్దకర్మ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ బోథ్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ హాజరయ్యారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.