కోనసీమ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయుపై న్యాయవాది కిషోర్ దాడి యత్నాన్ని ఖండిస్తూ ముమ్మిడివరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలోన్యాయవాదులు మంగళవారం నిరసన తెలిపారు. న్యాయమూర్తిపై జరిగిన దాడిని న్యాయవ్యవస్థ గౌరవంపై, రాజ్యాంగ స్ఫూర్తిపై జరిగిన దాడిగా ప్రతి పౌరుడు భావించాలని న్యాయవాదులు నినాదాలు చేశారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు