ఓ వ్యాపారవేత్తను రూ.60 కోట్ల మేర మోసం చేసిన కేసులో నటి శిల్పా శెట్టిని ముంబై పోలీసులు విచారించారు. 4 గంటల పాటు విచారించిన పోలీసులు ఆమె బ్యాంక్ స్టేట్మెంట్ వివరాలు, ఇతర ఖర్చుల గురించి ఆరా తీసినట్లు సమాచారం. కొన్ని కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ కేసులో ఇటీవల ఆ నటి భర్త రాజ్‌కుంద్రాను కూడా పోలీసులు విచారించారు.