సూర్యాపేట జిల్లా కోదాడ పోలీస్ స్టేషన్ పరిధిలో 60లక్షల విలువైన 1 క్వింటా 20 కేజీల గంజాయినీ కోదాడ పట్టణ, సీసీఎస్ పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. ముగ్గురు అంతరాష్ట్ర నింధితులను అరెస్ట్ చేశారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా ఎదుట వారిని ప్రవేశపెట్టారు. ఎస్పీ నరసింహ మాట్లాడుతూ.. గంజాయి రవాణా నేరం అని అన్నారు.