VZM: కొత్తవలస మండలం వీరభద్రాపురం రైతు సేవ కేంద్రంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం వ్యవసాయ అధికారిణి భారతి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వరిపంట ఆశాజనకంగా ఉందని, రైతులందరికీ ఎరువులు సక్రమంగా అందించామన్నారు. రానున్న రోజుల్లో యూరియా, పొటాష్ అందుబాటులో ఉంటాయన్నారు.