W.G: నరసాపురం, మొగల్తూరు మండలాల తీర ప్రాంతాల్లో విషపు ఈగల పుట్టలు దర్శనమిస్తున్నాయి. తాటి, కొబ్బరి, మామిడి చెట్లపై వీటి గూళ్లను గుర్తించారు. ఈ ఈగల కుట్టుతో భరించలేని నొప్పితో పాటు కళ్లు తిరగడం, సొమ్మసిల్లిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో వైద్యం అందకపోతే ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. ఈ ఈగల రాకతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.