కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార 1’ సినిమా మంచి హిట్ అందుకుంది. ఇండియాలోనే కాదు నార్త్ అమెరికాలో కూడా సాలిడ్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. అక్కడ ఈ చిత్రం 2.7 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్స్ సాధించి 3 మిలియన్ డాలర్ల వైపు వెళ్తోంది. ఇక ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ నిర్మించగా.. రుక్మిణి వసంత్ కథానాయికగా నటించారు.