TG: తెలంగాణ పోరాటయోధుడు కొమురం భీమ్ వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఇవాళ రాష్ట్రంలోని కొన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. కొమురం భీమ్ 85వ వర్ధంతి నేపథ్యంలో ఆయన పుట్టిపెరిగిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు ప్రత్యేక సెలవు ఇచ్చింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.