NTR: ‘స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్’ మొట్టమొదటిసారి ప్రవేశపెట్టిన ‘స్వచ్ఛాంధ్ర’ అవార్డులలో విజయవాడ నగరపాలక సంస్థ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. సోమవారం సాయంత్రం తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా కమిషనర్ ధ్యాన చంద్ర ఈ అవార్డును అందుకున్నారు.