KMR: కుక్కలను బైక్ ఢీకొని ఆర్టీసీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. మంగళవారం స్థానికుల వివరాల ప్రకారం.. రామారెడ్డికి చెందిన బండారు బసవయ్య ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. రామారెడ్డి నుంచి కామారెడ్డికి వెళ్తుండా సిరిసిల్ల రోడ్ గంజి గేట్ సమీపంలో కుక్కలు గుంపుగా రావడంతో కుక్కలను ఢీకొని ద్విచక్ర వాహనం నుంచి కింద పడి తీవ్ర గాయాలు అయ్యాయి.