కడపలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. నంద్యాల జిల్లాకు చెందిన యువతి రిమ్స్ డెంటల్ కాలేజీలో BDS ఫస్ట్ ఇయర్ చదువుతోంది. నిన్న ఉదయం 11 గంటలకు ఆమె ఎగ్జాం రాయాల్సి ఉంది. సరిగా పరీక్ష రాయలేనని భయాందోళనకు గురైంది. నిన్న ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత హాస్టల్ బిల్డింగ్పై నుంచి కిందకు దూకేసింది. వెంటనే రిమ్స్ క్యాజువాలిటీ వార్డుకు తరలించారు.