ADB: అమృత్ 2.0 పథకంలో భాగంగా TWRJC పాఠశాల ఆవరణలో జరుగుతున్న నీటి ట్యాంకు నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ రాజర్షి షా సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల పురోగతిని సమీక్షించిన కలెక్టర్, పనులు వేగవంతం చేయడానికి లేబర్ల సంఖ్యను పెంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి నీటి సరఫరా అందించాలని స్పష్టం చేశారు.