ATP: బెలుగుప్ప మండల పరిధిలోని బూధివర్తి గ్రామ సమీపంలో సోమవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. ప్రమాదంలో లారీ డ్రైవర్ శంకర్ మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతి చెందిన డ్రైవర్ శంకర్ మృతదేహాన్ని ఉరవకొండ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.