HYD: నగరంలో మరోసారి ఐటీ అధికారుల సోదాలు చేస్తున్నారు. కొండాపూర్, కూకట్పల్లి ప్రాంతాల్లో సోదాలు చేస్తున్న ఐటీ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కొండాపూర్ అపర్ణ హోమ్స్‌లో ఉంటున్న వెంకట్ రెడ్డి అనే వ్యక్తి నివాసంలో ఐటీ సోదాలు జరగుతున్నాయి. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ఉన్నట్లుగా తెలియడంతో అనధికారిక లావాదేవీల ఆధారంగా ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి.