ADB: జిల్లా కేంద్రంలో నిర్వహించిన కొమరం భీమ్ వర్ధంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, SP అఖిల్ మహాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. ఆదివాసీల ఆత్మగౌరవం అస్తిత్వం కోసం ఉద్యమించిన గొప్ప నాయకుడు అని కొనియాడారు. ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు.