BHPL: రేగొండ మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో మంగళవారం BRS ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ 22 నెలల పాలనలో ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని కోరారు. BRS నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.