SRD: ఖేడ్ నియోజకవర్గంలో దాదాపు 50 గ్రామాల్లో గత 15 రోజుల నుంచి మిషన్ భగీరథ నీరు రావడంలేదని మాజీ ZPTC రాథోడ్ లక్ష్మీ రవీందర్ నాయక్ మంగళవారం ఖేడ్ లో సబ్ కలెక్టర్ ఉమా హారతి కి ఫిర్యాదు చేస్తూ విన్నవించారు. బతుకమ్మ, దసరా పండుగల సమయంలో నీటి ఎద్దడితో ప్రజలు నానా అవస్థలు పడ్డారని చెప్పారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందులో నాయకులు పండరి ఉన్నారు.