SRCL: సుప్రీంకోర్టులో కేసు విచారణ సమయంలో చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్‌పై నిన్న ఓ లాయర్ డయాస్ వద్దకు వెళ్లి షూ తీసి ఆయనపై విసిరేందుకు ప్రయత్నించడం రాజ్యాంగంపై దాడి అని వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం అన్నారు. మంగళవారం దాడికి ప్రయత్నించడాన్ని నిరసిస్తూ కోర్టు ప్రధాన ద్వారం ముందు న్యాయవాదులతో నిరసన తెలిపి కోర్టు విధులను బహిష్కరించారు.