MLG: తాడ్వాయి మండలం బీరెల్లి గ్రామంలో రోడ్లు దారుణంగా మారాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ పరిధిలో సీసీ రోడ్లకు ఇరువైపులా సైడ్ డ్రైనేజీలు లేకపోవడంతో బురద నీరు రోడ్లపైకి వస్తోంది. దీంతో నడవడం ఇబ్బందికరంగా ఉందని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు, పంచాయతీ కార్యదర్శి స్పందించి తక్షణమే బురద నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని ఇవాళ కోరారు.