AP: ఢిల్లీలో భారీగా ఎర్రచందనం నిల్వలను పోలీసులు పట్టుకున్నారు. తిరుపతి నుంచి ఢిల్లీకి అక్రమంగా తరలించిన దాదాపు 10 టన్నుల దుంగలను సౌత్ ఈస్ట్ ఢిల్లీకి చెందిన స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.