MHBD: స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకమని పాలకుర్తి MLA యశస్విని రెడ్డి అన్నారు. మంగళవారం పాలకుర్తి మండల కేంద్రంలో ఆమె పెద్దవంగర మండల ముఖ్య నాయకులతో సమీక్షా నిర్వహించారు. MLA మాట్లాడుతూ..రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు చేయాలన్నారు. గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు సమన్వయంతో పని చేయాలన్నారు.