NRML: భారీ వర్షాలతో ఖానాపూర్ పట్టణంలోని బస్టాండ్ బురద మయంగా మారింది. దీంతో పట్టణ ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగు రోజులుగా ఖానాపూర్ మండలంలో భారీ వర్షాలు పడి బస్టాండ్ ఆవరణ అంతా వరద నీరు నిలిచి నడవలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. బస్టాండ్ ఆవరణను బాగు చేయించాలని ప్రజలు కోరారు.