SKLM: ఆశా వర్కర్స్కు వేతనాలు పెంచాలని సీఐటీయు జిల్లా అధ్యక్షులు అమ్మన్నాయుడు డిమాండ్ చేసారు. మంగళవారం రణస్థలంలోని పాతర్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నిరసన ధర్నా చేసారు. ఆశాలకు కనీస వేతనాలు చెల్లించాలని, సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఆశాలకు గత 6 సంవత్సరాల నుంచి వేతనాలు పెంచలేదని, పని భారం పెరిగిందని అవాపోయారు.