TPT: సూళ్లూరుపేటలో మంగళవారం ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెచ్ఐవీ / ఎయిడ్స్ అవగాహన ప్రచార రథం నిర్వహించారు. ప్రజల్లో ఆరోగ్య సదుపాయాలు, ఎయిడ్స్ నిరోధంపై చైతన్యం కల్పించేందుకు ఈ రథాన్ని ప్రారంభించారు. రథం ద్వారా పల్లెలకు, పట్టణాలలో ప్రజలు ఆరోగ్యంపై అవగాహన పెంచుకుని సమాజంలో ఎయిడ్స్ వ్యాప్తి తగ్గించేందుకు భాగస్వామ్యం కావాలని అధికారులు కోరారు.