ASF: ఆసిఫాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో రెండో విడత ప్రవేశాలు ముగిసినట్లు ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మి మంగళవారం ప్రకటనలో తెలిపారు.100 సీట్లకు 97 మంది ప్రవేశాలు పొందారని పేర్కొన్నారు.రాష్ట్ర కోటాలో 85 సీట్లకు 85 మంది, ఆల్ ఇండియా కోటాలో 15 సీట్లకు రెండో విడతలో 12 మంది ప్రవేశాలు తీసుకున్నారని తెలిపారు. ఈనెల 20 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయన్నారు.