SRPT: సూర్యాపేట పట్టణంలో అర్హత లేకుండా గర్భిణీ మహిళలకు లింగ నిర్ధారణ, అబార్షన్లు చేస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఇద్దరు ఆర్ఎంపీలు, ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు ఉన్నారు. నిందితుల నుంచి అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్, నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు.