TG: తాను మాదిగ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టే మంత్రి పదవి వచ్చిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ‘నేను మంత్రి కావడం, మా సామాజికవర్గంలో పుట్టడం తప్పా?. మంత్రి పొన్నం మాదిరిగా అహంకారంగా మాట్లాడటం నాకు రాదు. ఆయన మారకపోతే జరిగే పరిణామాలకు ఆయనదే బాధ్యత. త్వరలో సోనియా, రాహుల్, ఖర్గే, మీనాక్షి నటరాజన్‌ను కలుస్తా’ అని వెల్లడించారు.