SRD: సిర్గాపూర్(M) గర్డెగాంలో మంగళవారం వాల్మీకి రుషి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ ముదిరాజ్ సంఘం భవనంలో సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి విగ్రహానికి పూజలు చేసి, దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మండల సంఘం అధ్యక్షులు రమేష్, తుకారాం మాట్లాడుతూ.. వాల్మీకి రచనలు, రూపాంతరం మానవ విలువలకు ప్రతిబింబంగా నిలిచాయన్నారు. అనంతరం అన్నదానం చేసినట్లు తెలిపారు. ఇందులో నారాయణ, బాలాజీ తెలిపారు.