KDP: వేంపల్లి మండలంలోని పాములూరు పెద్దబండరాయి వద్ద 7 ఎకరాల ప్రభుత్వ భూమిని TDP నేత, మాజీ జిల్లా కార్యదర్శి ఎద్దుల శేషారెడ్డి కబ్జా చేశారని CPI పులివెందుల కార్యదర్శి వెంకటరాములు ఆరోపించారు. దీనిపై పులివెందుల RDO చిన్నయ్యకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని, తక్షణమే భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.