చిత్తూరు జిల్లా సచివాలయంలో మంగళవారం మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టరు మాట్లాడుతూ.. వాల్మీకి సంస్కృత సాహిత్యంలో పేరెన్నికగల కవి అన్నారు. రామాయణాన్ని వ్రాశాడని, ఈయన్ని సంస్కృత భాషకు ఆదికవిగా గుర్తిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఆముద పాల్గొన్నారు.