కోనసీమ: బొద్దవరం గ్రామానికి చెందిన గ్రీన్ అంబాసిడర్ అయినవిల్లి శేఖర్‌కు ఉత్తమ సేవా పురస్కారం లభించింది. ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శేఖర్‌ను జిల్లా ఉత్తమ గ్రీన్ అంబాసిడర్‌గా ఎంపిక చేసి అవార్డును అందజేశారు. అవార్డు గ్రహీత శేఖర్‌ను గ్రామ సర్పంచ్ వేగి లక్ష్మి, ఎంపీడీవో నారాయణ అభినందించారు. ఆయన సేవలు మరికొందరికి ఆదర్శం కావాలని ఆకాంక్షించారు.