BDK: ఏసీపీ సబ్బతి విష్ణుమూర్తి గుండెపోటుతో హైదరాబాదులో మృతి చెందారు. మంగళవారం జూలూరుపాడు మండలంలోని వారి స్వగృహంలో ఏసీపీ భౌతిక కాయానికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు.