VZM: పైడితల్లి సిరి మానోత్సవం సందర్బంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి మంగళవారం అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ఆలయ ఆర్చకుల ఆశీర్వచనాలు పొందారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పైడితల్లి అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.