ADB: కొమరం భీమ్ వర్ధంతి సందర్భంగా మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కొమరం భీమ్ విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జల్ జంగల్ జమీన్ నినాదంతో రజాకార్లకు వ్యతిరేకంగా కొమురం భీమ్ పోరాడారని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాయల్ శరత్, వేదవ్యాస్, ఆకుల ప్రవీణ్, మయూర్, సతీష్, రాకేష్, దయాకర్, రవి, పాల్గొన్నారు