NRML: నిర్మల్ జిల్లాలో గడిచిన 24 గంటలలో 766.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణ శాఖ అధికారులు మంగళవారం ప్రకటించారు. అత్యధికంగా ముధోల్ మండలంలో 97 మిల్లీ మీటర్లు, ఖానాపూర్ 80.0, నర్సాపూర్ 72.2, దిలావర్పూర్ 79.2, కుబీర్ 46.0, కుంటాల 66.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందన్నారు. రాబోయే 24 గంటలలో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.