SRCL: సిరిసిల్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి రథోత్సవం మంగళవారం సాయంత్రం జరగనుంది. ఈ రథోత్సవంలో మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటలకు స్వామివారి రథాన్ని లాగే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులుతో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొననున్నారు.