KMR: క్రీడాకారులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాలని బిక్కనూర్ సిద్ధిరామేశ్వర ఆలయ పీఠాధిపతి సదాశివ్ మహంత్ సూచించారు. ఇటీవల పరుగు పందెంలో గెలుపొందిన పట్టణానికి చెందిన విద్యార్థినులు నందిని, మధుప్రియలను ఆయన మంగళవారం అభినందించారు. భవిష్యత్తులో జాతీయస్థాయిలో రాణించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.