HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత వస్తున్న రెండో ఉప ఎన్నిక. గతంలో కంటోన్మెంట్ నియోజకవర్గంలో బైపోల్స్ నిర్వహించారు. అక్కడ స్థానిక ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో ఎన్నికలు రాగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇపుడు మాగంటి మృతితో ఈ ఎన్నికలు వచ్చాయి. ఈ ఉప ఎన్నికల్లో కూడా గెలిచి తమ పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.