ELR: ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామంలో మంగళవారం సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. మండల పరిషత్ నిధులు ఆరు లక్షల రూపాయలతో సిమెంటు రోడ్డు పనులు చురుగ్గా జరుగుతున్నాయి . పనులను ఎంపీటీసీ సభ్యులు బండారు నాగరాజు, అరివెల్లి మహాలక్ష్మీ దానయ్య, ఇంజనీర్ అసిస్టెంట్ విజయ్‌లు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.