AP: వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘రామాయణ కావ్యాన్ని రచించడం ద్వారా కుటుంబ జీవన విలువలతోపాటు సమాజ శాంతికి బాటలు వేసిన ఆదికవి వాల్మీకి మహర్షి. బోయ రత్నాకరుడు మహర్షి వాల్మీకిగా మారారు. నేటి సమాజానికి ఆయన బోధనలు ఆచరణీయం. వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా వారి సూక్తులను స్మరించుకుందాం’ అని కొనియాడారు.