AP: సత్యసాయి జిల్లా కొత్త చెరువులో సుమంత్ కృష్ణ అనే వ్యక్తి బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. అయితే వ్యవసాయంపై మక్కువతో ఆయన ఆ ఉద్యోగం వదిలేసి స్వగ్రామం వచ్చాడు. నాలుగున్నర ఎకరాల భూమి కొనుగోలు చేసి.. రూ.20 లక్షల పెట్టుబడితో పట్టుపురుగుల షెడ్డు నిర్మించాడు. ఒకసారి 500 గుడ్లు పెంచుతున్నాడు. ప్రస్తుతం ప్రతి నెలా ఖర్చులు పోనూ నెలకు రూ.లక్ష వస్తుందని చెప్తున్నాడు.